Saturday, September 25, 2010

ఇక దేవేందర్ గౌడ్ కూడా నీతులు చెప్పేవాడే

ఇక దేవేందర్ గౌడ్ కూడా నీతులు చెప్పేవాడే, ఎ పార్టీలో వుండాలి, ఎ సిద్దంతాలు పాటించాలో  తెలియని ఒక చంద్రబాబు సిద్ధాంతం తప్ప ఇంకొకటి తెలియని ఈయన చంద్రబాబు మెప్పు కోసం తెలంగాణా ఉద్యమాన్ని తాకట్టు పెట్టడం క్షమించరాని నేరం. హైదరాబాద్ చుట్టూ వున్నతన భూములను కాపాడుకోవటానికి టి డి పి నుంచి  బయటికి వచ్చి తెలంగాణా ఫై ప్రేమ వున్నట్టు నటించి, ఆ తరువాత సామాజిక న్యాయం అంటూ చిన్నజీవి చిరంజీవి తోక పట్టుకొని ఆ సినిమా ఫ్లాప్ కావడం తో మళ్లీ మొదటికి వచ్చిన దేవేందర్ గౌడ్ ఇన్ని పార్టీలు మారడానికి కారణం ఏమిటో చెప్పని దేవేందర్ గౌడ్  తెలంగాణా కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్దపడిన చంద్రశేకర్ రావు ని విమర్శించే హక్కు లేదు.ఇదే సమయంలో చంద్రబాబు చెప్పులు మోస్తూ తెలంగాణాకి ద్రోహం చేస్తారా లేక తెలంగాణా సాదించే   ప్రక్రియలో బాగాస్వామ్యులు అవుతాడో ఆయనే తేల్చుకోవాలి.

రెండు కండ్ల సిద్దాంత చంద్రబాబు నాయుడు

రెండు కండ్ల సిద్దాంత చంద్రబాబు నాయుడు ఎప్పుడు అయితే శ్రీ కృష్ణ కమిటీ కి తెలంగాణా కు అనుకూలంగా లేఖ ఇస్తాడో అప్పుడే టి డి పి తెలంగాణాలో బతికి వుంటది లేఖ పోతే తెలంగాణా ప్రజలు టి డి పి ని బొంద పెడతరు.